Friday, March 30, 2018

అందాల రాముడు - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

శ్రీరామ నవమి సందర్భంగా ఈనాడు దినపత్రిక ప్రధాన సంచికలో నేను రాసిన వ్యాసం
http://www.eenadu.net/special-pages/makarandham/makarandham-inner.aspx?featurefullstory=20698

Tuesday, March 20, 2018

రామయ్య ధర్మమార్గం


యుగయుగాలుగా అఖండ భూమండలం జపిస్తున్న తారకమంత్రం ఒకటే - అదే శ్రీరామ మంత్రం. కేవలం 'రామ' అనే పదం పలికినంతలోనే మనసు ఎంతో తేలికపడుతుంది. అంతులేని ఆనందం కలుగుతుంది. గుండె గదుల్లో గూడుకట్టుకున్న విచారం మటుమాయం అవుతుంది. ఎల్లలు లేని ప్రశాంతత కలుగుతుంది. ఇక అంతా మంచే జరుగుతుందన్న భరోసా కలుగుతుంది. కుల, మత, వర్గ, ప్రాంత, జాతి విచక్షణ లేకుండా సకల మానవాళీ రామయ్యను తమ దైవంగా, ఇంటి బంధువుగా, ఇలవేల్పుగా, ఆత్మబంధువుగా కొలుచుకుంటుంది. రామయ్య విషయంలో ఎవరికీ అభిప్రాయ భేదాలు లేవు. మరే ఇతర దైవానికి సాధ్యం కాని మహత్తు ఇది. రామయ్యకే ఎలా సాధ్యమైంది? 
సకల సుగుణాలు పోతపోసి, తీర్చిదిద్దిన రూపమా అన్నట్లు రామయ్య అడుగడుగునా దర్శనమిస్తారు. యావద్భూమండలంలో ఉన్న అన్ని భాషల్లో రామకథ అవతరించటానికి కారణం ఇదే. వందల సంఖ్యలో కవులు రామ చరితను రాసి, రామ కథను గానం చేసి, పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్యాన్ని పొందారు. సుప్రసిద్ధ సంస్కృత రచయిత 'మురారి' తన 'అనర్ఘరాఘవం' అనే నాటకంలో ఇలా అంటాడు.

యదిక్షుణ్ణం పూర్వైరితి జహతి రామస్య చరితం
గుణైరేతావద్భిర్జగతి పునరన్యో జయతి క:?

'కవులందరూ రామకథను మాత్రమే ఎంచుకున్నారంటే, అది వారి దోషం ఎంతమాత్రం కానే కాదు. 
ఉత్తమోత్తమమైన సుగుణాలన్నీ కేవలం రామునిలో మాత్రమే కేంద్రీకృతం కావటం వల్లనే వారు అలా చేయాల్సి వచ్చింది. రామునితో సమానమైన  ఉత్తమ గుణ సంపన్నుడు ఇంకా ఈ భూమి మీద జన్మించలేదు.' - ఈ ఒక్క వాక్యం చాలు శ్రీరామచంద్రుని జీవితం ఎంతటి ఉత్తమగుణ శోభితమైందో గ్రహించటానికి.

దేవతలంతా సాక్షాత్తు విష్ణు స్వరూపంగా కొలుస్తున్నా, 'ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం' - నేను దశరథ మహారాజు కుమారుడను మాత్రమే అని అత్యంత అణకువగా పలకగలిగిన వినయ సంపద రామయ్యకే చెల్లింది. అందుకే ఆయన సకల లోకాలకు ఆరాధ్యుడయ్యాడు. 

పూర్తిగా మానవుడిగా సంచరిస్తూ, కుమారుడిగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, పాలకుడిగా ఎలా జీవించాలో ఆచరించి చూపించిన అవతారమూర్తి రామచంద్రమూర్తి. ఎంతటి కష్టం వచ్చినా, చేతికి అందివచ్చిన రాజ్యం విడిచిపెట్టాల్సి వచ్చినా, క్రూర మృగాల మధ్య జీవించాల్సి వచ్చినా, చివరకు భార్యను రాక్షసులు అపహరించినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సోదరుడు యుద్ధరంగంలో మూర్ఛపోయినా, ధర్మ మార్గాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకనే 'రామో విగ్రహవాన్‌ ధర్మ:, రాజా సర్వలోకస్య దేవానామివ వాసవ:' అని రాక్షసులు కూడా రామయ్య ఘనతను కొనియాడారు. రామయ్య జీవితంలో అడుగడుగునా ధర్మమార్గం గోచరిస్తుంది. 

వాల్మీకి రామచంద్రమూర్తి గుణగణాలను వివరిస్తూ ' స్మితభాషీ, హితభాషీ, పూర్వభాషీ చ రాఘవ:' అంటాడు. మేలు చేకూర్చే మాటలను, చిరునవ్వుతో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ, తానే ముందుగా ఇతరులను ఆప్యాయంగా పలకరించేవాడు రామయ్య. మ¬న్నతమైన ఈ గుణం వల్ల రామయ్య పట్ల ఎవరికీ ద్వేషభావం కలిగేదికాదు. 

రామయ్య సీతమ్మను పందెంలో గెలిచి, వివాహం చేసుకున్నాడు. అలాగని, సీతారాములది ప్రేమ వివాహం కాదు. గాంధర్వ వివాహమో, మరే ఇతర పద్ధతో కాదు. పూర్తిగా పెద్దల అంగీకారంతో జరిగిన వివాహం. అయినా, రామయ్య బలవంతంగా, అయిష్టంగా సీతమ్మను స్వీకరించలేదు. 

ప్రియాతు సీతా రామస్య దారా: పితృ కృతా ఇతి
గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతి: భూయోభివర్ధత || 

పెద్దలు కుదిర్చిన వివాహం కావటం వల్ల రామయ్య సీతమ్మను మరింతగా ఇష్టపడ్డాడు. సీతమ్మ కూడా తన గుణగణాలతో రామయ్యకు తనపై ప్రేమ కలిగేలా చేసుకుంది. ఆదర్శ దాంపత్యానికి అసలైన అర్థం ఇది. ఒకరినొకరు అర్థం చేసుకుని, అడుగులో అడుగు వేసుకుని జీవన గమనం సాగించాలన్న సందేశం రామయ్య ఆచరించి, చూపించాడు. 

రాముడు అనగానే గుర్తుకువచ్చే పదం - ఏకపత్నీవ్రతం. తన భార్యను తప్ప లోకంలో ఉన్న స్త్రీలందరినీ రామయ్య సోదర భావంతో చూసేవాడట. ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకునే త్యాగరాజు తన పంచరత్న కృతుల్లో ఒకచోట రామయ్యను 'పరనారీ సోదరా!' అని సంబోధిస్తాడు. యావత్ప్రపంచం అనుక్షణం మననం చేసుకోవాల్సిన తారకమంత్రం ఇది. మూడుముళ్ళ బంధాలు మూడు క్షణాల సంబంధాలుగా మారుతున్న నేటి కాలంలో రామయ్య అనుసరించిన ఏకపత్నీవ్రతం, ఈనాటి యువతకు తక్షణ కర్తవ్యం. 

తనను ఆశ్రయం కోరి వచ్చిన వారికి రాజుగా ఎలాంటి అభయం ఇవ్వాలో విభీషణుడి వృత్తాంతం ద్వారా రామచంద్రమూర్తి లోకానికి ఆచరించి చూపించాడు. అన్నగారి ధర్మబాహ్య ప్రవర్తన నచ్చని విభీషణుడు శ్రీరామ చరణాలను ఆశ్రయిస్తాడు. లక్ష్మణుడితో సహా వానర ప్రముఖులందరూ విభీషణునికి ఆశ్రయం ఇవ్వద్దని రామయ్యకు సూచిస్తారు. 'అభయం సర్వభూతోభ్యే దదామి, ఏతత్‌ వ్రతం మమ' - నన్ను ఆశ్రయించిన వారికి అభయం ఇచ్చి తీరతానన్నాడు రామయ్య. చివరకు రావణాసురుడు వచ్చినా, అతడికి కూడా అభయం ఇస్తాను. ఇది నా వ్రతం అని నిష్కర్షగా తేల్చి చెప్పాడు. ఇదీ రఘురాముని ఘనత. 

యుద్ధరంగంలో రాముడు ప్రదర్శించిన పరాక్రమ స్ఫూర్తి అత్యద్భుతమైంది. 'రిపూణామపి వత్సల:' అని గరుత్మండుడే స్వయంగా రాముడిని కీర్తిస్తాడు. శత్రువుపై కూడా ఔదార్యం చూపించగల ఉత్తమ గుణం రామునికే సాధ్యం.

రామ, రావణ సంగ్రామం మొదలైంది. ఒక్కొక్కరుగా రాక్షస వీరులు నేలకొరుగుతున్నారు. ఇంద్రజిత్తు, లక్ష్మణుల యుద్ధం ప్రారంభమైంది. రోజులు గడుస్తున్నాయి. చిట్టచివరికి లక్ష్మణుడు ఇలా అన్నాడు ...'ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది, పౌరుషేచ అప్రతిద్వంద్వ శరైరం జహి రావణం' - నా అన్నగారైన రామచంద్రమూర్తి ధర్మాత్ముడు, సత్యసంధుడు, పౌరుషవంతుడు అయితే ఈ బాణం రావణసుతుడైన ఇంద్రజిత్తును సంహరించుగాక' అని, రాముని శ్రేష్ఠ గుణాలను తలచుకుని, బాణాన్ని ప్రయోగించాడు. ఉత్తరక్షణంలో ఇంద్రజిత్తు విగతజీవుడయ్యాడు. రాక్షసుడిని అంతం చేసింది రామచంద్రమూర్తి ఆచరించిన ధర్మవ్రత శక్తిగానీ, అస్త్రమహిమ కాదని ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది. 

కుంభకర్ణుడు కూడా రాముని చేతిలో హతుడయ్యాడు. అప్పటికే రాక్షస వీరులందరూ స్వర్గానికి చేరుకున్నారు. చివరగా, రావణుడే యుద్ధరంగానికి కదిలి వచ్చాడు. రామరావణులు ఎదురెదురు పడ్డారు. నిరంతర శివనామ ధ్యానంతో, అఖండ శివపూజ ఫలితంగా మ¬న్నతమైన తేజస్సును సాధించిన రావణాసురుడిని చూసిన రామయ్య ఆశ్చర్యపోయాడు. 'ఆ¬దీప్తమ¬ తేజా, రావణో రాక్షసేశ్వర:, ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో రస్మిభిర్భాతి రావణ:' - ఆహా! రావణుని తేజస్సు ఎంత గొప్పది. సూర్య సమానమైన తేజస్సు ఇతనిలో ఉంది అని శత్రువును సైతం శ్లాఘించాడు. శత్రువులోని గొప్పదనాన్ని ప్రశంసించగల ఔన్నత్యం రఘురామునికి మాత్రమే ఉంది. రావణుడు ఎంతటి తేజస్సంపన్నడైనా, ఎన్ని తపస్సులు చేసినా, ధర్మమార్గాన్ని విడిచిపెట్టటం వల్ల రాముని చేతిలో నిహతుడయ్యాడు. 

'ఏతదస్త్ర బలం దివ్యం మమవా త్య్రంబకస్యవా...' - ప్రచండ భాస్కరుడిలా యుద్ధరంగంలో నిలిచిన రాముడు పలికిన మాట ఇది. 'ఈ పని (శత్రుసంహారం) నేను చేయగలను. లేదా శివుడు చేయగలడు. మూడోవానికి ఈ పని సాధ్యం కాదు' - ఇదీ రఘురాముని వీరపరాక్రమం. అంతేకాదు, తనకు శివునకు గల అభేదాన్ని కూడా రామయ్య ఈ సందర్భం ద్వారా ప్రకటిస్తాడు. 

రామరావణ సంగ్రామంలో అరిభయంకరమైన తేజస్సుతో రాముడు చేస్తున్న శస్త్రాస్త్ర ప్రయోగానికి, చూపిస్తున్న క్షాత్ర పరాక్రమానికి హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వానరవీరులు ఎంతో ఆశ్చర్యపోతారు. 'ఈయనకు మా సాయం అవసరమా? రాముడొక్కడే సకల రాక్షస గణాన్ని తుదముట్టించగలడు. లోకకల్యాణం కోసం తాను చేసే అధర్మ నిర్మూలనలో మాకు కూడా భాగం కల్పించటానికే రామయ్య మమ్మల్ని అనుగ్రహించాడు. ఇదంతా దైవలీల' అంటారు జాంబవంతాదులు. ఇదీ రఘురాముని పరాక్రమం. 

రాముడిది సత్యపరాక్రమం. అందుకనే తాటకిని కూల్చింది మొదలు రావణ సంహారం రామచంద్రమూర్తి ప్రదర్శించిన శౌర్యప్రతాపాలను వర్ణించాల్సి వచ్చిన సందర్భంలో వాల్మీకి మహర్షి 'రామ: సత్యపరాక్రమ:', 'స్నిగ్ధ వర్ణ: ప్రతాపవాన్‌' - అనే పదాలను పునరుక్తి దోషం అని కూడా భావించకుండా, ఎన్నో సార్లు ఉపయోగించారు. అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో ఋషివేషంలో ఉన్నా, ధర్మపరిరక్షణ కోసం క్షాత్రధర్మాన్ని ప్రదర్శించి, వారికి రాక్షసబాధ లేకుండా చేశాడు. 

రామచంద్రమూర్తిది ధర్మవీరత్వం. అధర్మం పెచ్చుమీరినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి, ధర్మ మార్గాన్ని పున: ప్రతిష్ఠ చేయటానికి ధర్మం క్షాత్రరూపం దాలుస్తుంది. ఆ రూపమే ధర్మవీరత్వం. ఇటువంటి ధర్మవీరత్వానికి రాముడు నిలువెత్తు నిదర్శనం.

ఒకటా, రెండా...? వందలా.. వేలా..? ఇలాంటివి అనంతమైన ఉదాహరణలు రామాయణం నిండా 

ఉన్నాయి. రామయ్య ప్రతి అడుగులో ధర్మ దేవత ఆకృతిదాల్చి కనిపిస్తుంది. అందుకే సకల లోకాలకు ధర్మవీరుడైన రఘురాముని జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. ఆయన మార్గం ధర్మమార్గంగా సమాజాన్ని సన్మార్గంవైపు నడిపిస్తుంది. అదే సకల మానవాళికి శ్రీరామరక్ష. 



- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం 






Friday, March 9, 2018

బాలల హక్కులు నిజంగానే అమలవుతున్నాయా? ....ఈనాడు దినపత్రికలో డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం


పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదు...ఈనాడు దినపత్రికలో డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం



యువత భవిష్యత్తు కోసం పంచసూత్రాలు ... ఈనాడు దినపత్రికలో డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం


పుస్తక పటనం వల్ల ప్రయోజనాలెన్నో..! ఈనాడు పత్రికలో డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం


వేదం గణితం అంటే...? సాక్షి దినపత్రికలో వచ్చిన కధనం


Thursday, March 1, 2018

ఏ సమయంలో నిద్ర లేవాలి ?

ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది??

ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పుపట్టిన కత్తితో ఏ సైనికుడు యుద్ధం చేయలేడు.అందుకే యుద్ధానికి వెళ్లేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి. అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా..జీవిత పరమర్థాన్ని తెలుసుకోవాలన్నా , సాధనమైన శరీరాన్ని అందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రాచీన రుషులు మనకు అందించిన మార్గమే సదాచారం.
ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు. ఆయన తన చివరి రోజుల్లోభగవంతుడిని ప్రార్థిస్తూ, తాను మరల పుడితే భారత దేశంలో పుట్టాలని కోరుకున్నాడట. అయితే ఈనాటి ఇంగ్లీష్ ఎడ్యుకెటేడ్ ఆధునిక మేధావులు, సెక్యులర్ వాదులు , మార్క్స్ మేకాలే వాదులు మాత్రం పుణ్యభూమి భారత్ విలువ తెలియక ఇప్పటికి మన దేశాన్ని నిందిస్తున్నారు. మాక్స్ ముల్లర్ భారత్ లో పుట్టాలని కోరుకోవడానికి ప్రధాన కారణం సదాచార పూర్ణమైన భారతీయ జీవన విధానం. మానవుడు నిద్రలేవడంతోనే అతని దైనందిన జీవితం ఆరంభమౌతుంది. సదాచారంలో మొదటి అంశం నిద్రలేవటం.
నిద్ర ఎప్పుడు లేవాలి..?
ఈ విషయంలో మన ధర్మ శాస్త్రాలు, వైద్యశాస్త్రం ఏం చెప్పాయి..?
నిద్ర లేచే విషయంలో హిందు ధర్మ శాస్త్రాలు, వైద్య శాస్త్రం కూడా ఒకే మాటగా బ్రాహ్మే ముహూర్తే బుద్ధేతఅని, అలాగే బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితంఅని పేర్కొన్నాయి. ఆయురారోగ్యాలతోపాటు ధర్మాచరణకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ ధర్మ గ్రంథాలు తెలిపాయి.
సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రమంటారు. దీనికి ముందున్నదే బ్రాహ్మీ ముహూర్తం. అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం. ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింపగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. దీనిని ఆదాన సమయం అంటారు.
మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు శిథిలత నిచ్చు సమయం. ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాల శక్తులు సన్నగిల్లుతాయి. దేహం విశ్రాంతి కోరుకుంటుంది. దీనిని విసర్గ సమయం అంటారు. ఆదాన సమయంలో నిద్రపోవటం, విసర్గ సమయంలో మెలకువగా ఉండటం శారీరకంగానూ, మానసికంగానూ అనారోగ్యకరమైంది. దీంతో బుద్ది చురుకుదనం కోల్పోతుంది. లౌకిక వ్యవహారాలకే ప్రాధాన్యత నిచ్చేవారు ఈ వత్యాసం గుర్తించలేరు. ఇలాంటి వారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింప చేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు. అందుకే ఇలాంటి వారికి అవసరమైన శాంతస్థితి చేకూరదు. దీంతో వీరు నిజమైన సుఖ శాంతులకు దూరం అవుతారు. ఈ ప్రవృత్తిని నిశాచర ప్రవృత్తిగా పిలుస్తారు.
వేకువ జామునే నిద్ర లేచే విషయంలో పసిపిల్లలే సదాచారపరులు. చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తాన్నే నిద్రలేస్తారు. వాళ్లను నిద్రలేపుతారు. పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం. బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు సకల పుష్పాలుఈ ముహూర్తంలోనే పరిమళాలు వేదజల్లుతాయి. అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ది కూడా వికసించి ఉత్తమ సమాలోచనలు పొందుతుంది. అందుకే ఇది బ్రాహ్మీ ముహూర్తం అయ్యింది. బ్రాహ్మీ అంటే సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్లు తుడుచుకోవాలి. కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్లకు హఠాత్తుగా వెలుగు చూపటం దోషం. అందుకై ఇలా చన్నీటితో తుడుచుకోవాలి.
ఆ తర్వాత సముద్ర వసనే దేవి! పర్వత స్తనమండలే, విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమేఅని భూదేవికి నమస్కరించిన తర్వాతే పాదం భూమిపై మోపే ఆచారం మన పెద్దలది. మన దైనిందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము. కాబట్టే మనకు తిండిని ప్రసాదించే, జీవితాంతం మనలను భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకొని నెత్తిన కాలు పెట్టుటం కనీస కర్తవ్యం. కాలు తగిలితే సారీ చెప్పుకొనే నాగరికతను చూస్తున్న మనంభూదేవిని క్షమించమని ప్రార్థనను చేయలేమా?
నిద్రలేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతోంది. నిద్రలేవగానే శ్రోతియుని , గుణ సంపన్నుని, గోవును, అగ్నిని, సోమయాజిలాంటి వారినే చూడాలని, పాపిష్ఠివారిని, అమంగళకర వ్యక్తులను చూడతగనది అంటారు. ఇలా అనడంలో నిద్రలేచిన వెంటనే చేసే దర్శనం ఆరోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఎప్పుడైన ప్రమాదం జరగగానే ఛీ..నిద్రలేస్తూ ఎవరి మొగం చూచానో అనుకోవడం మనం చూస్తాం. చాలా మంది నిద్రలేవగానే అరచేతిని చూచుకొంటారు.
కరాగ్రే వసతే లక్ష్మీ-కరమధ్యే సరస్వతీ! కరమూలే స్థితో బ్రహ్మా- ప్రభాతే కరదర్శనం!! అనేది ఆర్ష వ్యాక్యం. అరచేతి అగ్రభాగం లక్ష్మీస్థానం. మధ్యభాగం సరస్వతి స్థానం. కరమూల బ్రహ్మ లేదా గోవింద స్థానం. కాబట్టే ఉదయం లేవగానే అరచేతిని చూచుకొంటారు. అరచేతిలో శ్రీరామ వ్రాసి కన్నుల కద్దుకొవడం కొందరు చేస్తారు. నిద్రలేవనగానే ఏ విధంగానైన దర్శనం అయ్యేటట్లు చేసుకోవడం మంచిది.
దైవ ప్రార్థన తర్వాత ముఖం, కాళ్లు చేతులు కడుగుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. అనంతరం జలపానం చేయాలి. ప్రాతఃకాల జలపానం ఎంతో ఆరోగ్యప్రదం. రాత్రి నిద్రకు ముందు రాగి, వెండి , కంచు లేదంటే మట్టి పాత్రలో మంచినీరుంచి ప్రాతః కాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది. వాత పిత్తశ్లేష్ఠు, ప్రకోపాలు తొలగటమేకాక హృద్రోగం, కాస, శ్యాస, క్షయ, అస్మరీ..మూత్రంలో రాళ్లు, గ్రహణీ….రక్త విరేచనాలు, అతిసార, అతి మూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమిస్తాయి. అంతేకాక సంతోషం, బలం, ఆయుర్వృద్ధి, వీర్యవృద్ధి,ఆరోగ్యం కలుగుతాయి. జలపానం చేశాక కొంత సేపు నడవడం మలబద్దకాన్ని పొగడుతుంది.

బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతః స్మరణ కర్త్యవంగా మన పెద్దలు చెప్పారు. ప్రాతఃస్మరణతో పుణ్యము, సంస్కారం, చేకూరుతాయి. ఇష్టదైవాలతోపాటు, మహనీయులను, పుణ్యతీర్థాలను స్మరించటం, మహనీయుల జీవిత విశిష్టతను తెలుసుకొని ఆచరణలో వారిని ఆదర్శంగా స్వీకరించడం జీవితానికి ధన్యత.

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు - విధానం


*🍁కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళాయె..

*💧రేపటి నుంచి ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు

*💧ఏప్రిల్‌లో 2నుంచి ఎగువ తరగతులకు

*🍥అధునాతన సాంకేతిక విద్యనందించే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయ్యింది. గురువారం నుంచి అన్ని కేవీల్లో ప్రవేశాల సందడి మొదలవ్వనుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు జారీ చేసిన నోటిఫికేషన్‌ విద్యాలయాలకు చేరింది. ఆన్‌లైన్‌ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరగబోతుంది.*

*💧గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏడు కేంద్రీయ విద్యాలయాలున్నాయి. సత్తెనపల్లి, గుంటూరు సమీపంలోని నల్లపాడు, తెనాలి, బాపట్ల సమీప సూర్యలంకలో గుంటూరు జిల్లా పరిధిలోని కేవీలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో విజయవాడలో రెండు, మరొకటి మచిలిపట్నంలో ఉంది. రాజధాని ప్రాంతంలో మరో రెండు, మూడు నూతనంగా వచ్చే విద్యా సంవత్సరంలో రాబోతున్నాయి.*

*💧దరఖాస్తు గడువు :

 ఒకటో తరగతిలో ప్రవేశాలకు మార్చి 1 నుంచి 19వ తేదీ సాయంత్రం 4 వరకు. 
మిగిలిన తరగతులకు : రెండో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం వరకు ప్రవేశాలకు ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి 9 వరకు. 

*💧వయసు అర్హత:

ఒకటో తరగతిలో ప్రవేశానికి మార్చి 31వ తేదీ నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి. ఏడేళ్లలోపు వారికే ప్రవేశం ఉంటుంది. రెండో తరగతికి ఆరేళ్లు, 3వ తరగతికి ఏడేళ్లు, 4వ తరగతికి ఎనిమిదేళ్లు, ఐదో తరగతికి తొమ్మిదేళ్లు, ఆరో తరగతికి పదేళ్లు, ఏడో తరగతికి 11 సంవత్సరాలు, ఎనిమిదో తరగతికి 12 సంవత్సరాలు, తొమ్మిదో తరగతికి 13 సంవత్సరాలు, పదో తరగతికి 14 ఏళ్లు నిండి ఉండాలి. 
*💧సీట్లు ఇలా:

ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో తరగతికి 40 చొప్పున సీట్లు ఉంటాయి. తాజాగా ఒకటో తరగతికి ప్రతి విద్యాలయంలో 40 చొప్పున ప్రవేశాల్ని నూతనంగా కల్పిస్తారు. ఆపై విద్యార్థులకు ప్రవేశాలకు కల్పించాలనుకుంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఉన్నతస్థాయి అధికారులు.. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 

*💧వీరికి ప్రాధాన్యం :⤵*

🍥ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసేవారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. కేంద్ర అనుబంధ సంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు, ఒకే సంతానం కలిగిన కుటుంబాల్లోని వారికి ప్రాధాన్యం ఉంటుంది. పార్లమెంట్‌ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మావన వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్‌ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. 
ప్రవేశాలు ఇలా 
తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో 100 మార్కులకు పరీక్ష రాయాలి. హిందీ, ఆంగ్లం, గణితం, సైన్సు, సోషల్‌ పాఠ్యాంశాల్లో ఈ పరీక్ష ఉంటుంది. 100 మార్కులకు ఇతరులు కనీసం 33, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 25 మార్కులు సాధించాలి. ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటాయి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా చేపడతారు. ఎక్కువగా సీట్లు ఖాళీ ఉండి వెయిటింగ్‌లో విద్యార్థులుంటే లాటరీ పద్ధతిలో అర్హుల ఎంపికను చివరిదశలో నిర్వహిస్తారు. ఖాళీలతో పాటు అదనపు సీట్ల భర్తీని కేవీఎస్‌ డీసీ జులై 31వ తేదీలోపు చేపడతారు. 

*💧రిజర్వేషన్లు ఇలా :

🍥15 శాతం సీట్లను ఎస్సీలకు.. 7.5 శాతం సీట్లను ఎస్టీలకు, 3 శాతం సీట్లను దివ్యాంగులకు రిజర్వు అవుతాయి. మిగిలిన సీట్లు ఇతరులకు కేటాయిస్తారు. జాతీయ విద్యాహక్కు చట్టం(ఆర్‌టీఈ) నిబంధనల మేరకు ప్రతి తరగతిలో 10 సీట్లను ఉచిత బోధనా పద్ధతిలో భర్తీ చేస్తారు. లాటరీ ద్వారా వీరి ఎంపిక ఉంటుంది. ఒకటో తరగతిలో ఆర్‌ఈటీ కింద ప్రవేశం పొందితే పాఠశాల చదువు పూర్తయ్యే వరకు ఉచిత బోధన లభిస్తుంది. 
ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి : హెచ్‌టీటీ://కేవీఅడ్మిషన్‌ఆన్‌లైన్‌2018.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లోనే ప్రవేశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంది. 

*💧ప్రవేశం లభిస్తే దశ తిరిగినట్లే :*

 🍥సీబీఎస్‌ఈ సిలబస్‌లో కేంద్రీయ విద్యాలయాల్లో బోధన ఉంటుంది. పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తారు. ఒకటో తరగతి నుంచే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం.. శాస్త్రసాంకేతికతపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలుంటాయి. మిగిలిన పాఠశాలలకు భిన్నంగా దీని పనివేళలు.. సెలవులు ఉంటాయి. ఆటపాటలు.. స్వేచ్ఛతో కూడిన విద్య వీటిద్వారా పిల్లలకు అందుతుంది. ఒకసారి కేవీలో ప్రవేశం లభిస్తే ఇక విద్యార్థి దశ తిరిగినట్లే. ఆ సదావకాశాన్ని పొందేందుకు నవ్యనగరి ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రులు త్వరపడాల్సిన అవసరముంది

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...