Friday, August 10, 2018

కృష్ణా జిల్లా విశేషాలతో ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr K. Ramakrishna) రాసిన వ్యాసం


చదువులమ్మ సేవలో... - ఈనాడు దినపత్రికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr K. Ramakrishna) రాసిన వ్యాసం


క్రిష్ణాతీరంలోని జానపద కళారూపాల గురించి ఈనాడు దినపత్రికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr K. Ramakrishna) రాసిన వ్యాసం


ఉషశ్రీ గారి వ్యాఖ్యాన వైభవం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr K. Ramakrishna) ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం


నదీ హారతుల గురించి ఈనాడు దినపత్రికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr K. Ramakrishna) రాసిన వ్యాసం


కృష్ణా పుష్కరాల సందర్భంగా (2016) - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr K. Ramakrishna) ఈనాడు దిన పత్రికలో రాసిన వ్యాసం


కూచిపూడి నృత్య వైభవం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దిన పత్రికలో రాసిన వ్యాసం


పిల్లల్ని కొట్టటం వల్ల ప్రయోజనం ఉంటుందా? - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం





విజయవాడతో బాలమురళి గారి అనుబంధం - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr K. Ramakrishna) ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం


హోలీ పండుగ గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) శ్రీశైలప్రభ మాసపత్రికలో రాసిన వ్యాసం




పుస్తకాలు స్ఫూర్తికి నిలయాలు - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr K. Ramakrishna) ఈనాడు పత్రికలో రాసిన వ్యాసం


కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్ వెన్నా వల్లభరావు గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) తెలుగు వెలుగు మాస పత్రికలో రాసిన వ్యాసం



Tuesday, August 7, 2018

చిరపురాతనం .... కావాలి నిత్యనూతనం. - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ


చిరపురాతనం ....  కావాలి నిత్యనూతనం.

                మనుషుల మేధానైశిత్యాన్ని బట్టి భాష అభివృద్ధి చెందుతుంది. ఒకేరకపు భాష వ్యవమరించే వాళ్ళు ఒక్కచోట మనగలుగుతారు. భాషను ప్రేమించే వాళ్ళు ఎప్పుడు విడిపోరు. భాషా వ్యవహారాలు విడిపోవాలనుకుంటే అందుకు వేరే కారణాలు ఉండవచ్చు. భాష మాత్రం విడిపోవటానికి కారణం కాదు. భాష మనుషుల మద్య అనుబంధాల్ని పెంచుతుంది. అంతరంగాలలోని భావతరంగాలు వాగ్రూపాన్ని పొందనితే అవి అలా మనోసంద్రంలో మాసిపోవలసిందే. వేరే దేశాలలో ఉండేవారు తమ మాతృభాష వినబడగానే పొంగిపోయేది కేవలం ఈ మాతృభాషాను బంధంతోనే.

                మన మాతృభాష తెలుగు, తెనుగు, ఆంధ్రం అన్న పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఈ పేర్లు ఎలా వచ్చాయి? అనే ప్రశ్నలకు సమాదానాలుగా ఎన్నో సిద్ధాంతాలు, నిరూపణలు మనకు లభిస్తున్నాయి. విటన్నింటిలో అక్కడక్కడా కొన్ని భేదాలు కనిపించినప్పటికి, అన్నింట్లో అంతస్యూత్రంగా నిలచిన సారూప్యం ఏమిటంటే - తెలుగు ఎంతో ప్రాచీన భాష. కనీసం ఏడువేల సం|| పూర్వమే ఆంధ్రజాతి ఉన్నది అని.

                తెలుగు భాష ఉనికికి, చారిత్రక నేపధ్యానికి సంబంధించి మనకు లభిస్తున్న చారిత్రక సత్యాలు, ఘటనలు, నేపద్యాలు. వివరణలు.

       దక్షారామము, శ్రీశైలము, కాళేశ్వరం, అనే త్రిలింగ క్షేత్రాల మద్య ఉన్న ప్రాంతం కనుక త్రిలింగ దేశం అన్ని, అదే క్రమేణా తెలుగుదేశం, తెలుగుదేశం అయినదని శైవసాంప్రదాయ సిద్ధాంతం.

       ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రశబ్దం దేశపరంగా, జాతి పరంగా ఉపయోగించారు. చరిత్రకారుల నిర్ధారణను బట్టి చూస్తే ఇతరేయ బ్రాహ్మణం యొక్క కాలం క్రీ. పూ. ఐదువేల సం|| దీన్నిబట్టి చూస్తే నేటికి ఏడువేల సం|| క్రితమే ఒకదేశం ఉన్నది. అది ఆంధ్రదేశం ఆ జాతి ఆంధ్రజాతి.

       ఆష్టాదశ పురాణాలలో అతిప్రాచీనమైనదైన స్కాందపురాణంలో ఆంధ్రజాతి ప్రసక్తి ఉన్నది.

       భారతంలో కౌరవులు పక్షాన యుద్ధం చేసిన రాజులలో ఆంధ్రరాజులు ఉన్నట్లుగా వ్యాసభారతంలో కనిపిస్తుంది.

       రామాయణంలో సీతాన్వేషణ ఘట్టంలో చెప్పబడిన దేశాలలో ఆంధ్రరాజ్యం ఉన్నది.

       నేటికి స్మార్త భాగంలో ఉపయోగించే 'మహాసంకల్పం' లో ఆంధ్రదేశ ప్రస్తావన ఉన్నది.

                నన్నయ వ్రాసిన తెలుగు భారతాన్ని 'ఆదికావ్యం' గా అంగీకరించటం జరుగుతుంది. అంటే నన్నయకు పూర్వం మరే ఇతర తెలుగు కావ్యంలేదని కాదు. చరిత్రలో కాలగతి పట్టి పోయిన అతి ప్రాచీన గ్రంధాలు నేటికి అలభ్యం అవటం వల్ల తెలుగు భాష ప్రాచీనత పై ఇన్ని వాదోపవాదాలు వినిపించేందుకు ఒక కారణంగా కనిపిస్తోంది. గ్రంధాలు అలభ్యం అయినప్పటికీ, నన్నయకు పూర్వమే ద్విపదలు, రగడలు వంటి సాహిత్య ప్రక్రియలు, ఛాయలతో కూడిన ప్రయోగాలు కనిపిస్తాయి. ప్రకృతిలో మమేకమై జీవనం సాగించే పల్లెపడుచుల పదాలు. ఊడుపు పాటు, వీర గీతాలు, కుచ్చెల పాటలు... ఇలా ఎన్నో విభిన్న వృత్తుల వారు పాడుకునే గీతాలు. ఇవన్నీ తెలుగు సాహితీ ప్రక్రియలకు సుదూరాలు కావు. ఈ గేయల్లోని తెలుగు ఎంతో ప్రాచీనమైనది.
                ఆధారాలు, ఆయుః ప్రమాణాలంటూ అనవసరమైన తర్కాలు చేసి మనల్ని మనమే అపహాస్యం పాలు చేసుకుంటున్న ఈ వాదాలు వివాదాలకు ఇక స్వస్తి పలుకుదాం. చిరపురాతన తెలుగు వైభవం నిత్యనూతన శోభలతో తేజరిల్లేలా మనల్లి మనమే జాగృతపరచుకుందాం.

కాపాడుకుందాం మన వర్ణమాలను - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ


కాపాడుకుందాం మన వర్ణమాలను


                తెలుగుదనము వంటి తీయందనము లేదు
                తెలుగు కవుల వంటి ఘనులు లేరు
                తెలుగుతల్లి సాధుజన కల్ప వల్లిరా
   లలిత సుగుణ జాల తెలుగు బాల ..........  కరుణశ్రీ
                ప్రపంచంలోని ప్రతి జాతి మనుగడకు మూలాధారం భాష, భావ వ్యక్తీకరణకు ప్రధాన సాధనం భాష. తమ తమ భాషలలోని విశిష్టతల ఆధారంగా ప్రపంచంలోని జాతులన్నీ తమంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. భాష సంస్కృతికి జీవగతి, సాహిత్యము, సంస్కృతి  రెండు 'భాష' పునాదిగా ఏర్పడినవే. ఈ విధంగా భాష, సాహిత్యము, సంస్కృతి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగిఉన్నాయి. ప్రపంచంలోని ఏ జాతి చరిత్ర అయినా అక్కడి సంస్కృతి, భాషలతో ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. కాబట్టి సాహిత్య వికాసానికి, సాంస్కృతిక పురోభివృద్ధికి భాష ను ప్రధాన సాధనంగా చెప్పుకోవచ్చు. అంతేకాక, జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవటానికి కూడా 'భాష'' విశిష్ట సాధనంగా పని చేస్తుంది. ఒక జాతి సమగ్ర జీవన విధానాన్ని ఆ జాతి సంస్కృతిగా తీసుకుంటే, ఆ సంస్కృతికి జన్మనిచ్చి, పెంచి పోషించేది భాష. ఈ విధంగా వృద్ధి చెందిన సంస్కృతి, తరతరాలకు వారసత్వ సంపదగా నిలుస్తుంది.
                ప్రతి జాతి తన భాషను ప్రేమించడటంతో పాటు ఆ భాష గొప్పదనాన్ని గుర్తించగలిగి ఉండాలి. నిర్వవాదమయిన అంశాలపై నిశ్చయం దృఢం కావాలి. ప్రతి భాషకు ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వానికి అనుగుణంగా ఆ భాష మాట్లాడే వారి జీవలక్షణం ఉంటుంది. ఒక్కోక్క భాష మాట్లాడే వారి జీవ లక్షణాలను విశ్లేషిస్తే. ఆ భాషా వ్యవహారాల జీవన విధానంలో వైవిధ్యాలు ప్రస్ఫుటం అవుతాయి. ఈ నిశ్చల సత్యాన్ని గుర్తించారు కనుకనే ఆంగ్లేయులు తమ భాషను ప్రపంచం పై రుద్దే సాహసం చేశారు, చేస్తున్నారు.
                ''రాసేదొకటి - పలికేదొకటి'' గా ఉన్న ఆ '' అసంస్కృత భాష'' విశ్వవ్యాప్తంగా ఆరాధింపబడటానికి కారణం త్రికరణ శుద్ధిగా ఆంగ్లేయులు తమ భాష ఔన్నత్యాన్ని గుర్తించి, దానిని ప్రచారం చేయుటమే విశ్వనాధ సత్యనారాయణ '' విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు'' నవలలో ఆంగ్లంలోని అతార్కిక అంశాలెన్నింటినో ఎండగట్టారు. ఏది ఏమైన ఈ రోజున ప్రపంచమంతా 26 ఆంగ్ల అక్షరాల శక్తికి దాసోహం అంటోంది. కేవలం, ఆంగ్ల జాతీయుల ''భాషా ప్రచారవ్యూహం'' తప్ప, మరే ఇతర జీవశక్తిలేని ఆంగ్ల భాష ఈనాడు ప్రపంచ భాషగా గద్దెనెక్కి కూర్చుంది.
                అచ్చ తెలుగుకు అక్షరాలు ముప్పైఆరే ప్రాకృతంలో నలభై అక్షరాలు ఉన్నాయి. ఆంగ్లభాష ఆదినుండి ఇరవై ఆరు అక్షరాలు తరగని పెన్నిధితో అలరారుతూనే ఉంది. గ్రీకు భాషలోని ఇరవై ఒక్క అక్షరాలు, లాటిన్‌లోని ఇరవై నాలుగు అక్షరాలు అన్నీ నేటికీ సజీవంగానే ఉన్నాయి. కేవలం తెలుగు భాష మాత్రమే తన యాభై ఆరు అక్షర (సంపద) నిక్షేపాన్ని కాపుడుకోవటానికి నానా తంటాలు పడుతుంది. , , , ఙఞ, ఱ లు గుర్తుకు రావటం లేదు. ఋ, బుూ లు వ్యవహార సౌలభ్యానికి గుదిబండలుగా తయారయ్యయి. ఖ, ,, , భ లు స్వర తంత్రుల్ని దాటి బయటకు రావటం లేదు. ఇక తెలుగు భాష తెలుగోడి గుండెచప్పుడుగా మిగిలిపోయే రోజు వస్తుందేమో?. 'వాణి నారాణి' అని ఎలుగెత్తి చాటగలిగిన భాష ఇక అంతర్వాణిగా అంతర్వాహిని కావలసి వస్తుందేమో?

హయగ్రీవ స్వామి గురించి శ్రీశైలప్రభ పత్రికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం



ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...