Tuesday, August 7, 2018

కాపాడుకుందాం మన వర్ణమాలను - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ


కాపాడుకుందాం మన వర్ణమాలను


                తెలుగుదనము వంటి తీయందనము లేదు
                తెలుగు కవుల వంటి ఘనులు లేరు
                తెలుగుతల్లి సాధుజన కల్ప వల్లిరా
   లలిత సుగుణ జాల తెలుగు బాల ..........  కరుణశ్రీ
                ప్రపంచంలోని ప్రతి జాతి మనుగడకు మూలాధారం భాష, భావ వ్యక్తీకరణకు ప్రధాన సాధనం భాష. తమ తమ భాషలలోని విశిష్టతల ఆధారంగా ప్రపంచంలోని జాతులన్నీ తమంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. భాష సంస్కృతికి జీవగతి, సాహిత్యము, సంస్కృతి  రెండు 'భాష' పునాదిగా ఏర్పడినవే. ఈ విధంగా భాష, సాహిత్యము, సంస్కృతి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగిఉన్నాయి. ప్రపంచంలోని ఏ జాతి చరిత్ర అయినా అక్కడి సంస్కృతి, భాషలతో ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. కాబట్టి సాహిత్య వికాసానికి, సాంస్కృతిక పురోభివృద్ధికి భాష ను ప్రధాన సాధనంగా చెప్పుకోవచ్చు. అంతేకాక, జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవటానికి కూడా 'భాష'' విశిష్ట సాధనంగా పని చేస్తుంది. ఒక జాతి సమగ్ర జీవన విధానాన్ని ఆ జాతి సంస్కృతిగా తీసుకుంటే, ఆ సంస్కృతికి జన్మనిచ్చి, పెంచి పోషించేది భాష. ఈ విధంగా వృద్ధి చెందిన సంస్కృతి, తరతరాలకు వారసత్వ సంపదగా నిలుస్తుంది.
                ప్రతి జాతి తన భాషను ప్రేమించడటంతో పాటు ఆ భాష గొప్పదనాన్ని గుర్తించగలిగి ఉండాలి. నిర్వవాదమయిన అంశాలపై నిశ్చయం దృఢం కావాలి. ప్రతి భాషకు ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వానికి అనుగుణంగా ఆ భాష మాట్లాడే వారి జీవలక్షణం ఉంటుంది. ఒక్కోక్క భాష మాట్లాడే వారి జీవ లక్షణాలను విశ్లేషిస్తే. ఆ భాషా వ్యవహారాల జీవన విధానంలో వైవిధ్యాలు ప్రస్ఫుటం అవుతాయి. ఈ నిశ్చల సత్యాన్ని గుర్తించారు కనుకనే ఆంగ్లేయులు తమ భాషను ప్రపంచం పై రుద్దే సాహసం చేశారు, చేస్తున్నారు.
                ''రాసేదొకటి - పలికేదొకటి'' గా ఉన్న ఆ '' అసంస్కృత భాష'' విశ్వవ్యాప్తంగా ఆరాధింపబడటానికి కారణం త్రికరణ శుద్ధిగా ఆంగ్లేయులు తమ భాష ఔన్నత్యాన్ని గుర్తించి, దానిని ప్రచారం చేయుటమే విశ్వనాధ సత్యనారాయణ '' విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు'' నవలలో ఆంగ్లంలోని అతార్కిక అంశాలెన్నింటినో ఎండగట్టారు. ఏది ఏమైన ఈ రోజున ప్రపంచమంతా 26 ఆంగ్ల అక్షరాల శక్తికి దాసోహం అంటోంది. కేవలం, ఆంగ్ల జాతీయుల ''భాషా ప్రచారవ్యూహం'' తప్ప, మరే ఇతర జీవశక్తిలేని ఆంగ్ల భాష ఈనాడు ప్రపంచ భాషగా గద్దెనెక్కి కూర్చుంది.
                అచ్చ తెలుగుకు అక్షరాలు ముప్పైఆరే ప్రాకృతంలో నలభై అక్షరాలు ఉన్నాయి. ఆంగ్లభాష ఆదినుండి ఇరవై ఆరు అక్షరాలు తరగని పెన్నిధితో అలరారుతూనే ఉంది. గ్రీకు భాషలోని ఇరవై ఒక్క అక్షరాలు, లాటిన్‌లోని ఇరవై నాలుగు అక్షరాలు అన్నీ నేటికీ సజీవంగానే ఉన్నాయి. కేవలం తెలుగు భాష మాత్రమే తన యాభై ఆరు అక్షర (సంపద) నిక్షేపాన్ని కాపుడుకోవటానికి నానా తంటాలు పడుతుంది. , , , ఙఞ, ఱ లు గుర్తుకు రావటం లేదు. ఋ, బుూ లు వ్యవహార సౌలభ్యానికి గుదిబండలుగా తయారయ్యయి. ఖ, ,, , భ లు స్వర తంత్రుల్ని దాటి బయటకు రావటం లేదు. ఇక తెలుగు భాష తెలుగోడి గుండెచప్పుడుగా మిగిలిపోయే రోజు వస్తుందేమో?. 'వాణి నారాణి' అని ఎలుగెత్తి చాటగలిగిన భాష ఇక అంతర్వాణిగా అంతర్వాహిని కావలసి వస్తుందేమో?

No comments:

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the Ind...